Priyadarshi | ‘పెళ్లిచూపులు’ సినిమాలో “నా చావు నేను చస్తా.. నీకెందుకు” డైలాగ్‌తో ఓవర్‌నైట్ స్టార్ కమెడియన్‌గా మారిన ప్రియదర్శి ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ‘మల్లేశం’, ‘బలగం’ వంటి కంటెంట్ చిత్రాలతో నటుడిగా తన రేంజ్ పెంచుకున్నాడు ప్రియదర్శ. ఇక ఇటీవల విడుదలైన ‘కోర్ట్’ సినిమాతో తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు. కమెడీయన్‌గానే కాకుండా హీరోగా కూడా విజయవంతంగా రాణిస్తున్నాడు.ఆయన సినిమాలకి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రియదర్శి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమంటే’ ఈరోజు, నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవనీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్గా, సుమ కనకాల కీలక పాత్రలో కనిపించారు.
సినిమా రిలీజ్ సందర్భంగా ప్రియదర్శి సోషల్ మీడియాలో అభిమానులతో చిట్‌చాట్ చేశాడు. అభిమానుల ప్రశ్నలకు సరదాగా, ఓపిగ్గా సమాధానాలిచ్చిన ప్రియదర్శి, కొంతమంది అడిగిన తిక్క ప్రశ్నలకు కూడా తన స్టైల్లోనే హాస్యంతో కూడిన కౌంటర్లు ఇచ్చాడు. అందులో ఒక నెటిజన్, నువ్వు మూవీ తీయడం ఆపు అన్నా.. ప్లీజ్ అన్నా” అని కామెంట్ పెట్టగా, దానికి ప్రియదర్శి సరదాగా ..
“మరి ఏం చేయమంటావ్.. గడ్డి పీకాలనా?” అని రిప్లై ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా ఆ నెటిజన్ మరోసారి ప్రేరేపించేలా స్పందించడంతో, ప్రియదర్శి కూడా తన రేంజ్‌లోనే .. “న్యూ ట్రెండ్ అంటావ్ కదా… రేపు థియేటర్‌కి రా తమ్మి… నీ గుండెలు పిండి పంపిస్తా” అని మాస్ స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు.
ఈ రిప్లైపై నెటిజన్లు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. గట్టిగా ఇచ్చావ్… అలానే ఉండు ప్రియదర్శి! అంటూ కామెంట్ల మళ్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రియదర్శి కొత్త సినిమా ‘ప్రేమంటే’పై అభిమానుల్లో హైప్ పెరుగుతుండగా, అతని సరదా కౌంటర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రేమంటే చిత్రం ప్రియదర్శికి కూడా మంచి విజయాన్ని అందిస్తుందనే హోప్లో ఉన్నారు ఫ్యాన్స్.
Mari em cheyyamantav
Gaddi Peekalna?😅 https://t.co/HFnQJk2ujL— Priyadarshi Pulikonda (@Preyadarshe) November 20, 2025