Bala Krishna | టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణ అనే పేరు వినగానే ప్రేక్షకుల్లో ఉత్సాహం, ఎనర్జీ, మాస్ వైబ్ వచ్చేస్తాయి . ఐదు దశాబ్దాలుగా నటుడిగా వెలుగులు నింపుతున్న బాలయ్య తన స్టైల్, డైలాగ్ డెలివరీ, సింహంలా గర్జించే స్క్రీన్ ప్రెజెన్స్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. మాస్ హీరోగా ఆయనకు ఉన్న క్రేజ్ ఎంత ప్రత్యేకమో మరోసారి వెల్లడైంది. గోవా వేదికగా నవంబర్ 20న ప్రారంభమైన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) లో ఈసారి బాలకృష్ణను ప్రత్యేకంగా సత్కరించారు. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, కేంద్ర సమాచార–ప్రసారశాఖ సహాయమంత్రి ఎల్. మురుగన్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో ఆయనకు శాలువా కప్పి సన్మానించారు.
బాలయ్య సినిమాలు భారతీయ సినిమా పరిధిని దాటి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించడమే ఈ అరుదైన గౌరవానికి కారణమైంది. ఈసారి ఇఫీ వేడుకలు నవంబర్ 20 నుండి 28 వరకు కొనసాగనున్నాయి. ప్రారంభ వేడుకకు అనుపమ్ ఖేర్, శ్రీలీల, దిల్ రాజు సహా అనేక మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముగింపు వేడుకలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కూడా ప్రత్యేకంగా సత్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వేదిక ఏదైన బాలయ్య స్వాగ్‌కు సాటి లేదు. ఇఫీ వేదికపై కూడా అదే విషయం మరోసారి రుజువైంది.
శ్రీలీలతో కలిసి స్టేజ్‌పైకి వచ్చిన బాలయ్య.. అకస్మాత్తుగా తన కళ్లజోడును గాల్లోకి విసిరి, మళ్లీ స్టైల్‌గా పట్టుకోవడం అక్కడి ఆడియెన్స్‌ను షాక్‌కి గురి చేసింది. ఇది చూసి శ్రీలీల ఆశ్చర్యానికి గురైంది. ఈ చిన్న స్వాగ్ మోమెంట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. ఈ తరహా స్టైల్ యాక్ట్స్ బాలయ్య చేయడం కొత్తేమీ కాదు. ఈవెంట్లలో మైక్‌ను గాల్లోకి ఎగరేయడం, సెల్‌ఫోన్‌ను తిప్పడం, అనూహ్యమైన స్టైలిష్ హావభావాలు చూపించడం అన్నీ ఆయన మాస్ అటిట్యూడ్లో భాగమే. 60 ఏళ్లు వచ్చినా ఆయన స్టైల్‌కి సాటి లేదు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి సినిమాలు చేస్తున్నారు బాలయ్య.
#GodofMassesNBK Swag 🔥💥😍❤️
At International Film Festival of India, Goa.#NandamuriBalakrishna #Akhanda2 pic.twitter.com/f34wJNj1qo
— manabalayya.com (@manabalayya) November 20, 2025