Raj Kundra | బాలీవుడ్ సినిమాతో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన శిల్పా శెట్టి తరువాత టాలీవుడ్‌లోనూ హీరోయిన్గా మెరిసిన విషయం తెలిసిందే. అందం, అభినయం, డ్యాన్స్ ఇలా ఆల్‌రౌండ్ ప్రతిభతో అభిమానులను ఆకట్టుకున్న ఈ కర్ణాటక బ్యూటీ యాంకరింగ్ ద్వారా కూడా మంచి ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్న శిల్పా, ప్రస్తుతం సినీ జీవితంతోపాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో అనుబంధం కొనసాగిస్తోంది.
ఇటీవల ఈ స్టార్ దంపతులు 60 కోట్ల రూపాయల మోసం కేసులో ఇరుక్కోవడం బాలీవుడ్లో పెద్ద చర్చగా మారింది. వ్యాపారవేత్త దీపక్ కోఠారి చేసిన ఫిర్యాదు మేరకు ముంబయి జూహు పోలీస్ స్టేషన్లో శిల్పా–రాజ్ కుంద్రాలపై కేసు నమోదు అయింది.ఈ నేపథ్యంలోనే శిల్పా శెట్టి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నేతృత్వంలో జరిగిన ‘ఆధ్యాత్మిక పాదయాత్రలో’ పాల్గొనడం మరోసారి హాట్ టాపిక్ అయింది. ఊర్వశీ రౌతేలా, రణబీర్ కపూర్, భావనా పాండే వంటి పలువురు సెలబ్రిటీలు కూడా ఈ పాదయాత్రలో భాగమయ్యారు. వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తో… ట్రోలర్స్ విమర్శలకు తెరలేదపారు
కేసులు ఉన్నవాళ్లు ఇప్పుడు పాదయాత్రలు చేసి ఇమేజ్ క్లీన్ చేసుకుంటున్నారా?” అంటూ కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానించారు. అయితే ఈ ట్రోలింగ్‌పై రాజ్ కుంద్రా ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆయన ఇలా స్పందించారు. చీకట్లోనే బతకాలని చూడేవాళ్లు ఎప్పటికీ ఆరోపణలే చేస్తారు. ట్రోల్ చేయడం జీవితంగా మార్చుకున్న వాళ్లు ఒక రోజు తెలుసుకుంటారు… ఆరోపణలు అంటే అవి సత్యం అన్నమాట కాదు. సనాతన ధర్మానికి అండగా నిలిచిన వాళ్లను విమర్శించడం మీలోని సమస్య. చట్టం తన పని చేస్తుంది. స్క్రీన్షాట్లు తీసుకుంటూ, పోస్ట్‌లు పెడుతూ జీవితాన్ని నడిపించుకోండి అని రాసుకొచ్చారు. రాజ్ కుంద్రా చేసిన ఈ ఘాటైన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శిల్పా–రాజ్‌కు మద్దతుగా పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఆధ్యాత్మికత అంటే ఎవరికీ హాని చేయడం కాదు. దానిని కూడా ట్రోల్ చేయడం సిగ్గుచేటు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.