హైదరాబాద్: హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియోలకు జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు షాకిచ్చారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు పూర్తి స్థాయిలో చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్లు జీహెచ్ఎంసీ సర్కిల్ 18 అధికారులు గుర్తించారు. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నులు ఎగవేసినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో అధికారులు నోటీసులు జారీచేశారు.
కాగా, అన్నపూర్ణ స్టూడియో రూ.11.52 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉండగా రూ.49 వేలు మాత్రమే చెల్లిస్తున్నది. ఇక రామానాయుడు స్టూడియో రూ.1.92 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే రూ.1900 మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.