OG | పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఓజీ (OG)” పై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా గ్రాండ్ స్కేల్లో తెరకెక్కుతోంది. పవన్ కల్యాణ్ ఈ సినిమాలో ఓజస్ గంభీర అనే గ్యాంగ్‌స్టర్‌గా, పూర్తిగా మాస్ & స్టైలిష్ అవతారంలో కనిపించనున్నారు. ఈ పాత్ర ఆయన కెరీర్లో వినూత్నంగా నిలిచే అవకాశముంది. హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ శక్తివంతమైన విలన్ పాత్రలో దర్శనమివ్వనున్నారు. అలాగే శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే ఓ పవర్ఫుల్ BGM టీజర్‌ను విడుదల చేసిన సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్, తాజాగా జపనీస్ మ్యూజిక్ బీట్‌ను రిలీజ్ చేస్తూ మరోసారి ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచారు. జపాన్‌కు చెందిన ప్రాచీన వాయిద్య పరికరం “కోటో” సౌండ్‌తో కూడిన ఈ స్పెషల్ ట్రాక్, సినిమాకు డిఫరెంట్ మూడ్‌ను తీసుకురానుంది. తాజాగా లండన్ లోని ఓ ప్రముఖ స్టూడియోలో 117 మంది సంగీత కళాకారుల సహకారంతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రికార్డింగ్ జరుగుతోంది. తమన్ అందించిన ఈ అప్డేట్తో పాటు #HungryCheetah హ్యాష్‌ట్యాగ్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. పవన్ కల్యాణ్ మార్క్ మాస్ యాక్షన్, సుజీత్ స్టైలిష్ టేకింగ్, తమన్ మ్యూజిక్ ఇవన్నీ కలిసే ఈ సినిమా అభిమానులకు పండగలా మారనుంది. పవన్ కల్యాణ్ తన మార్క్ మాస్ ప్రెజెన్స్‌తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. “ఓజీ” మూవీపై హైప్, అంచనాలు చూస్తే ఇది మరో ఇండస్ట్రీ హిట్ అవ్వడం ఖాయం అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది.
J-A-P-A-N-E-S-E 🐆 !! #OGbgm 🀄️🐲🐉 pic.twitter.com/3jHiCWS9Vc
— thaman S (@MusicThaman) September 8, 2025