హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): చేతి వేళ్లు చూపిస్తూ స్మార్ట్ ఫోన్లతో సెల్ఫీలు దిగడం.. వాటిని స్టేటస్‌గా, డీపీలుగా పెట్టుకోవడం.. సోషల్ మీడియాలైనా ఇన్‌స్టాగ్రామ్‌లాంటి వాటిలో ఉంచడం పరిపాటిగా మారింది. ఇది చాలా ప్రమాదకరమైనదని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫొటోలోని చేతి వేళ్లతో సైబర్ నేరగాళ్లు నకిలీ వేలిముద్రలను తయారు చేస్తూ.. బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డులు, సెల్ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండటంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు.