హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతుండడంతో పిల్లల కోసం బడుల్లో అన్ని పనులను పూర్తి చేయాలని మైనారిటీ గురుకుల ప్రిన్సిపాళ్లను తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీజీఎంఆర్ఈఐఎస్) వైస్ చైర్మన్ మహ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి ఆదేశించారు.
మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో మైనారిటీ గురుకులాల ప్రిన్సిపాళ్లతో బడుల పున:ప్రారంభ ఏర్పాట్లపై సమీక్షించారు. పదో తరగతి, ఇంటర్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్కూళ్లను సందర్శించి, బాధితుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వారు అభినందించారు. కార్యక్రమంలో సీఎం సెక్రటరీ షానవాజ్ కాసీం, మైనారిటీ గురుకులాల సొసైటీ సెక్రటరీ పాల్గొన్నారు.