కుమ్రం భీం ఆసిఫాబాద్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఇందానీ ఎక్స్ రోడ్ వద్ద గల ఆర్ బి ఇండస్ట్రియల్ జిన్నింగ్ మిల్లో(Ginning mill) భారీ అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. పత్తి లోడుతో వచ్చిన వాహననికి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని వాహనంలోని పత్తితో పాటు మిల్లులో ఉన్న పత్తి దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Ramya | ఆ సన్నివేశాలు తొలగించండి.. కోర్టును ఆశ్రయించిన నటి రమ్య