కాశీబుగ్గ, సెప్టెంబర్ 6: వరంగల్ ఏనుమాముల మార్కెట్లో మక్కలకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ప్రభుత్వ మద్దతు ధర రూ.2,090 ఉండగా, నెల రోజులుగా క్రమంగా పెరుగుతున్నది.
ఈ సీజన్లోనే అత్యధికంగా శుక్రవారం క్వింటాకు రూ.3,015 ధర పలికినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.