కాశీబుగ్గ, సెప్టెంబర్ 12 : వరంగల్ ఎనుమాముల మార్కెట్లో గురువారం మక్కలకు రికార్డు ధర పలికింది. హనుమకొండ జిల్లా ఒంటిమామిడిపల్లికి చెందిన పెండ్లి తిరుపతి 66 క్వింటాళ్ల మక్కలు తీసుకురాగా సదా ఎంటర్ ప్రైజెస్ వ్యాపారి క్వింటాకు రూ. 3,070 చొప్పున కొనుగోలు చేశారు.
మరో రైతు 22 క్వింటాళ్లకు ఇదే ధర పలికింది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 2,090 ఉండగా నెల రోజులుగా ధర పెరుగుతున్నదని అధికారులు తెలిపారు. అధిక ధరతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.