మల్లాపూర్, నవంబర్ 20 : మక్కల విక్రయాలు సరిగా జరడం లేదని మక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. మక్కలను కొనుగోలు చేయడానికి సర్కార్ నిబంధనల పేరిట కొర్రీలు పెడుతున్నదని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై గురువారం రైతులు ధర్నా నిర్వహించారు.
మక్కలను తీసుకొచ్చామని, వారం రోజులు గడుస్తున్నప్పటికీ నిర్వాహకులు నిబంధనల పేరుతో కనీసం తేమ శాతం కూడా చూడడం లేదని ఆరోపించారు. వెంటనే మక్కలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.