MLA Sabitha | బడంగ్పేట్, జూన్ 24 : కాంగ్రెస్ నాయకులు తమ స్థాయిని మర్చిపోయి మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ మహేశ్వరం మండల అధ్యక్షుడు రాజు నాయక్, మర్యాద రాఘవేందర్ రెడ్డి, శంకరయ్య తదితరులు ధ్వజమెత్తారు. మహేశ్వరం మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాఘవేందర్ రెడ్డి, శంకరయ్య తోపాటు 200 మంది కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్న ఉద్దేశంతోనే తాను పార్టీ మారడం జరిగిందని రాఘవేందర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం, గతంలో ఉన్న పథకాలను కూడా ప్రజలకు అందించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం కావడం ద్వారానే బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందన్నారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సారధ్యంలోనే అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతోనే పార్టీని వీడడం జరిగిందన్నారు. కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చూపించాలని వారు సవాల్ విసిరారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు జరిగిన అభివృద్ధి ఎక్కడ చేశారో చూపించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు అరిగోసపడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. సబిత ఇంద్రా రెడ్డి నాయకత్వంలోని పనిచేస్తామని ఆయన తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు నాయక్, లీగల్ సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్, సామ జానారెడ్డి, పబ్బ ఆంజనేయులు గౌడ్, అబ్బ బాలరాజ్ గౌడ్, వెంకటేష్ గౌడ్, కుమార్, దయానంద్ గౌడ్, ఎం కుమార్ గౌడ్, మహేష్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.