మంత్రుల శాఖలన్నీ మార్చాలని సూచించా
ప్రస్తుత రాష్ట్ర క్యాబినెట్‌లోని మంత్రుల శాఖలన్నింటినీ మార్చాలని తాను కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించానని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. క్యాబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
- నన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలా? వద్దా? అనేది అధిష్ఠానం నిర్ణయమే
- పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుత రాష్ట్ర క్యాబినెట్‌లోని మంత్రుల శాఖలన్నింటినీ మార్చాలని తాను కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించానని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. క్యాబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా తానూ చేయాల్సింది, సూచించాల్సింది అంతవరకేనని పేర్కొన్నారు. మిగిలిన నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని స్పష్టం చేశారు.
క్యాబినెట్ విస్తరణ లేదా శాఖల కేటాయింపు అనేది పూర్తిగా అధిష్ఠానం పరిధిలోని అంశమని చెప్పారు. తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలా? వద్దా? అనే విషయాన్ని పూర్తిగా అధిష్ఠానానికే వదిలేశామని అన్నారు. ప్రస్తుతం తనకు పార్టీని నడిపించే అత్యంత బాధ్యతాయుతమైన పీసీసీ అధ్యక్ష పదవి ఉన్నదని, ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించేందుకు శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారని, అది కాంగ్రెస్‌లోనే సాధ్యమని వ్యాఖ్యానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

