హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఇన్ సర్వీస్ టెట్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు 2,315 మంది టీచర్లు పరీక్షలకు గైర్హాజరయ్యారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరిగాయి.
21,038 మందికి 18,723 (89%) మంది టీచర్లు హాజరైనట్టు టెట్ కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు. బుధవారంతో పరీక్షలు ముగుస్తాయి.