జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : మాజీ సీఎం, బీఆర్ఎ స్ అధినేత కేసీఆర్ చా వును కోరుతూ మాట్లాడిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను పోలీసులు వెంటనే అరెస్టు చేసి జైలుకు పం పాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ చా వు కోరుకోవడం ఎమ్మెల్యే శంకర్ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డే, ఎమ్మెల్యే శంకర్‌తో ఇలా మాట్లాడించారని ఆరోపించారు. దొంగ హామీలిచ్చి రాజ్యమేలుతున్న కాంగ్రెస్ పార్టీ చావునే ప్రజలు కోరుకుంటున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
పోలీసుల తీరు హేయం: డీకే అరుణ
అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిలతో పోలీసులు వ్యవహరించిన తీరు హేయమని బీజేపీ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరి ఆదేశాల మేరకు మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ప్రశ్నించారు. సీఎంగానా, హోమ్మంత్రిగానా, ఏ హోదాలో రేవంత్‌రెడ్డి పోలీసులను ఆదేశించారో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఘటనపై సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కాలయాపన చేయడం సిగ్గుచేటు : జాన్‌వెస్లీ
శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించకుండా.. అధికార, ప్రతిపక్ష పార్టీ లు ఒకరిపై ఒకరు బూ తులతో దూషించుకుం టూ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. ప్రజా సమస్యలను పకదారి పట్టించకుండా, అర్థవంతమైన చర్చ లు జరుపాలని సూచించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు నెట్టివేయడం, చీరలు లాగడం, మెడలు పట్టి నెట్టడం వంటి ఘటనలు అత్యంత హేయమైనవిగా పేర్కొన్నారు.