హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): జాతీయ ఉపాధిహామీ చట్టానికి మహాత్మాగాంధీ పేరును తొలగించిన అంశంలో పోరాటాన్ని ఉధృ తం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. కాంగ్రె స్ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ఢిల్లీ లో సోమవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన పీసీసీ అధ్యక్షుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంస్థాగతంగా జరుగుతున్న అంశాలు, పార్టీ నిర్మా ణం, మున్సిపల్ ఎన్నికలు, బూత్‌లెవల్ కమిటీల నిర్మాణం వంటి అంశాలపై చర్చించామని పేర్కొన్నారు.
ఏఐసీసీ నిర్ణయం మేరకు.. రాష్ట్రంలో ఉపాధిహామీపై క్షేత్రస్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. అందు లో భాగంగా ఈనెల 28 నుంచి 31 వరకు మీనాక్షితో కలిసి జిల్లాల్లో పర్యటించనున్నట్టు వెల్లడించారు. 28న మెదక్, మానకొండూరు, 29న వేములవాడ, ఎల్లారెడ్డి, 30న మేడారం స మ్మక-సారలమ్మ దర్శనం, సాయం త్రం ఆలేరు నియోజకవర్గంలో గ్రామసభ, 31న నకిరేకల్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. గ్రామ సభల్లో ఉపాధిహామీ కూలీలతో నేరుగా మాట్లాడుతామని వెల్లడించారు.