హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ 25వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ గడ్డపై అట్టహాసంగా నిర్వహించనున్న రజతోత్సవ సభకు అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారని పార్టీ ఎన్నారై సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ తెలిపారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ ఉత్సవాన్ని చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని నిర్ణయించడం గర్వంగా ఉందని తెలిపారు. ఆదివారం మహేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్లో 50దేశాల ఎన్నారైలు పాల్గొన్నారు. ఏడాదిపాటు ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.