హైదరాబాద్, ఆగస్టు11 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ సాలర్షిప్ పథకాన్ని ఎక్కువ మందికి వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని, దీంతో నిధుల విడుదలలో జాప్యమవుతున్నదని బీసీ సంక్షేమశాఖ స్పష్టంచే సింది. అర్హుల జాబితా ప్రకటన, నిధుల విడుదలలో జాప్యం అంశంపై ఇటీవల ‘విదేశీ విద్యానిధి ఎప్పుడు?’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. స్పందించిన బీసీ సంక్షేమశాఖ ఆదివారం పకటన విడుదల చేసింది. ఓవర్సీస్ స్కీంకు సంబంధించి ఈ ఏడాది ఎంపిక ప్రక్రియను మార్చి 2024లోనే పూర్తి చేయాల్సి ఉన్నదని, ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగిందని తెలిపింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివర కు ఏటా 300 మందికి స్కాలర్షిప్లు ఇచ్చేదని, ప్రస్తుతం ఆ సంఖ్యను రెండింత లు లేదంటే మూడింతలు చేయాలని సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఆలోచిస్తున్నదని వెల్లడించింది. అర్హుల ఎం పికను ఒకేసారి రిలీజ్ చేయాలని ప్రభు త్వం భావిస్తున్నదని వివరించింది. ఇప్పటికే సాలర్షిప్ మొదటి దశ పేమెంట్ పొందినవారికి రెండో దశ పేమెంట్ పూర్తి చేసేందుకు ఆర్థికశాఖను సంప్రదించామని, త్వరలోనే నిధులు విడుదల చేస్తారని తెలిపింది. ఓవర్సీస్ సాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థలు, తల్లిదండ్రు లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీ సంక్షేమశాఖ హామీ ఇచ్చింది.