హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఫూలే 134వ వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్తోపాటు అన్ని రాజకీయపార్టీలు, కుల సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫూలేకు ఘన నివాళులర్పించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. శాసనమండలిలో విపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, పద్మారావుగౌడ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వెంకటేశ్, ముఠా గోపాల్ నివాళులర్పించారు.