Tushar Gandhi | హైదరాబాద్, నవంబర్ 3(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని మూసీ నది ఒడ్డున బాపూఘాట్లో ఎత్తయిన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గాంధీ మునిమనువడు తుషార్‌గాంధీ వ్యతిరేకించారు. విగ్రహాల ఏర్పాటు పోటీకి తాను వ్యతిరేకమని, దయచేసి ప్రజాధనాన్ని వృథా చేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు. గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం చేసే ఖర్చును విద్య, వైద్యాన్ని మెరుగుపరిచేందుకు వినియోగించాలంటూ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్‌ను ప్రధాన పర్యాటక కేంద్రంగా, ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలని ప్రభు త్వం నిర్ణయించింది. అందులో భాగంగా బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్య ంత ఎత్తయిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే విగ్రహం డిజైన్, ఎత్తుపై నిపుణులు, డిజైనర్లతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నది. ఈ నేపథ్యంలో తుషార్‌గాంధీ ఇలా స్పందించడంతో కాంగ్రెస్ నేతలు డైలమాలో పడ్డారు.