కాంగ్రెస్, బీజేపీలకు గట్టి గుణపాఠం
కాంగ్రెస్ మోసాలు, బీజేపీ కక్షసాధింపు చర్యలకు మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఆ రెండు రాష్ర్టాల ప్రజలు రెండు జాతీయ పార్టీలకు బుద్ధిచెప్పారని తెలిపారు.
- రెండు పార్టీలకు బుద్ధిచెప్పిన మహారాష్ట్ర, జార్ఖండ్
- కాంగ్రెస్ గ్యారెంటీల గారడీని మహారాష్ట్ర ప్రజలు నమ్మలే
- బీజేపీ కక్ష సాధింపును ప్రజలు హర్షిస్తలేరని జార్ఖండ్ ఫలితాలతో తేలింది
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ మోసాలు, బీజేపీ కక్షసాధింపు చర్యలకు మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఆ రెండు రాష్ర్టాల ప్రజలు రెండు జాతీయ పార్టీలకు బుద్ధిచెప్పారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో 5 గ్యారెంటీల పేరిట చేసిన గారడీని ప్రజలు నమ్మలేదని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది నుంచి చేస్తున్న మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మహిళలకు రూ.2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయకుండా మహారాష్ట్రలో రూ.3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసరా దోఖా, రైతు రుణమాఫీ పూర్తి చేయకపోవడం వంటి అనేక అంశా లు మహారాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపాయని తెలిపారు. తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలోని ముంబయి, షోలాపూర్, పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండడం వల్ల కాంగ్రెస్ మోసాలపై విరివిగా ప్రచారమై అక్కడి ప్రజలు కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కారని వివరించారు.
జార్ఖండ్‌లో మాజీ సీఎం హేమంత్ సోరెన్‌పై బీజేపీ పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీని చీల్చే ప్రయత్నాలను ఆ రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని, బీజేపీ కక్ష సాధింపు విధానాలను ప్రజలు హర్షించడం లేదని జార్ఖండ్ ఫలితాలతో స్పష్టమైందని చెప్పారు. జార్ఖండ్‌లో విజయం సాధించిన హేమంత్ సోరెన్‌కు హరీశ్ శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

