హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రచారం పనిచేయలేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ నుంచి సొమ్ములు పంపినా కాంగ్రెస్‌కు ఫలితం దక్కలేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించడంపై హర్షం వ్యక్తంచేశారు. దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో కాంగ్రెస్ అనేక తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు మోదీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సరార్కే పట్టం కట్టారని తెలిపారు. బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయని, మరాఠాలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేశారని, 5 నెలల్లోనే ప్రజలకు వాస్తవం అర్థమైందని చెప్పారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు విపక్ష హోదా కూడా దకలేదని తెలిపారు. కాంగ్రెస్ మూడు రాష్ర్టాలకే పరిమితం అయ్యిందని ఎద్దేవా చేశారు. గ్యారెంటీల పేరుతో మభ్యపెట్టిన తెలంగాణ, కర్ణాటక, అదే పేరుతో మునిగిపోయిన హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రమే కాంగ్రెస్ ఉన్నదని చెప్పారు