యాదాద్రి, భువనగిరి : మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన రైతు సంఘం నాయకులు(Maharastra farmers Leaders ) యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే సునితామహేందర్ రెడ్డి(Mla Sunita Mahender Reddy) వారికి దగ్గరుండి దర్శనం చేయించి ఆలయ వివరాలను వెల్లడించారు. గతంలో ఆలయ స్థితిగతులు, బీఆర్ఎస్(BRS) అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో జరిగిన పునర్నిర్మాణం తదితర వివరాలను వారికి వివరించారు.
ఆలయాన్ని దర్శించుకున్న వారిలో విదర్భ ప్రెసిడెంట్ జగదీశ్ నానా బోండే, ఫార్మర్స్ యూనియన్(Farmers Union) అమరావతి జిల్లా అధ్యక్షుడు విజయ్ యశ్వంత్ విల్దేఖర్ , ఫార్మర్స్ యూనియన్ తహసీల్ ప్రెసిడెంట్ నందకుమార్ కెరిడే, అమరావతి జిల్లా ఫార్మర్ మాజీ అధ్యక్షుడు సంజయ్ థాయ్డే , అమరావతి జిల్లా యువజన అధ్యక్షుడు స్వప్నిల్ వాఖోడే, కిసాన్ యూనియన్ మాజీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ గాడే తదితరులు ఆలయాన్ని దర్శించుకున్నారు.
వీరితో పాటు మహారాష్ట్రకు చెందిన అజయ్ దేశ్ ముఖ్, సునీల్ షరివార్, సునిల్ పడోడే, ప్రవీన్ కుల్దే, గజానంద్ భగత్, సంజయ్ బ్రుస్కడే, విజయ్ లాజుర్కర్, సాగర్ గావండే, నానా సాహెబ్ బ్రహ్మణ్ ఖర్, పురుషోత్తం దోటే, కాశీనాథ్ పుటానీ, అరుణ్ సాకోరే, రుషబ్ వాకోడే, కుల్దీప్ బోండే, సునీల్ సాబ్ లే, జేడీ పాటిల్, సునీల్ కాచ్రే తదితరులున్నారు. ఇంకా మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధాహేమేందర్ గౌడ్, నాయకులు మిట్ట వెంకటయ్య గౌడ్, గుండ్లపల్లి భరత్ గౌడ్, ఆరె శ్రీధర్, కరుణాకర్ తదితరులున్నారు.