BRS Party | మహారాష్ట్రలో దూసుకుపోతున్న బీఆర్ఎస్.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భారీగా చేరికలు
BRS Party | హైదరాబాద్ : భారత్ రాష్ట్ర సమితి పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతూనే ఉంది. పొరుగు రాష్ట్రాల్లోని ఆయా పార్టీలకు చెందిన నేతలు, మేధావులు, డాక్టర్లు, ఇంజినీర్లు, అడ్వకేట్లు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని పల్లె పల్లెకు విస్తరిస్తామన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగానే మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్లోకి వలసలు శరవేగంగా సాగుతున్నాయి.
BRS Party | హైదరాబాద్ : భారత్ రాష్ట్ర సమితి పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతూనే ఉంది. పొరుగు రాష్ట్రాల్లోని ఆయా పార్టీలకు చెందిన నేతలు, మేధావులు, డాక్టర్లు, ఇంజినీర్లు, అడ్వకేట్లు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని పల్లె పల్లెకు విస్తరిస్తామన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగానే మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్లోకి వలసలు శరవేగంగా సాగుతున్నాయి. బుధవారం హైదరాబాద్లో పలువురు రాజకీయ నాయకులతో పాటు పలు రంగాలకు చెందిన వృత్తి నిపుణులు, ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో నాసిక్ సివిల్ సర్జన్ డాక్టర్ లక్ష్మణ్ సబలే, ఆర్థోపెడిక్ డాక్టర్ బిలాల్ షేక్, అడ్వకేట్ ఎన్కే మహాజన్, క్రిస్టియన్ ట్రైబల్ కమ్యూనిటి స్టేట్ ప్రెసిడెంట్ సందీప్ దేవ్రే, లాథూర్లోని దేవ్నీ కార్పోరేటర్ సూర్యవంశి అమిత్ విజయ్ ప్రకాష్, భుసావల్కు చెందిన నితిన్ తయాడే, స్వాభిమాని షేట్కారి సంఘటన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమ్ నాథ్ బోరడే, గంగాఖేడ్ మున్సిపాలిటి కార్పోరేటర్లు తుకారం తాండడే, బాలాసాహెబ్ రేక్, పాలం మున్సిపాలిటి కార్పోరేటర్లు బబ్లూ సైయద్, చాంద్ పఠాన్, బీడ్ కో ఆపరేటివ్ బ్యాంక్ మెంబర్ శివాజీ రావ్ ఘోడకే, స్వాభిమాని పక్ష్ జిల్లా అధ్యక్షుడు కుల్దీప్ కర్పే, బీడ్ సేవా సెహ్ కారి సంస్థ ఛైర్మన్ కమలాకర్ లాండే, స్వాభిమాన్ పక్ష్ తాలూకా ప్రెసిడెంట్ లాహు గైక్వాడ్, జలగావ్కు చెందిన భికు సోనావానే, సోను పాటిల్, సునీల్ రౌత్, విలాస్ మలేస్, నాసిక్కు చెందిన సచిన్ కడ్, ముకుంద్ అహిర్, రామ్ నికమ్, బాపు దూబె, ప్రొఫెసర్ చంద్రకాంత్ భచౌ, కార్పోరేటర్, ఎన్సీపి షేలు తహసీల్ ప్రెసిడెంట్ రహీమ్ ఖాన్ పఠాన్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

