CM KCR | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్ను గెలిపిస్తే రెం డు-రెండున్నరేండ్లలోనే వెలుగులు విరచిమ్మే మహారాష్ట్రను తయారుచేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రజలు చైతన్యంతో ముందుకు సాగాలని, ఎంత త్వర గా మేల్కొంటే అంత నష్టం తగ్గుతుందని సూ చించారు. ఇంతకాలం దేశాన్ని పాలించినవారి అసమర్థతవల్లే నేడు చిన్నచిన్న వస్తువులను కూడా దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, ప్రతినిధులు పెద్ద సం ఖ్యలో బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
మహారాష్ట్రకు వెలుగులిస్తాం
దేశాన్ని ఇంతకాలం పాలించిన పార్టీలే ప్రస్తుత వెనుకబాటుకు కారణం. 75 ఏండ్లలో మహారాష్ట్రలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి! కాంగ్రెస్ చాలా ఎక్కువకాలం పాలించింది. శివసేన కూడా రెండు దఫాలు పాలించింది. బీజేపీ, ఎన్సీపీ కూడా పాలించాయి. కానీ ఒక్కరు కూడా అభివృద్ధి చేయలేకపోయారు. ఇందులో ఏదో గడ్బడ్ ఉన్నది. దీనిపై నేను ఓ మిత్రుడితో మాట్లాడుతూ దాల్ మే కుచ్ కాలా హై అన్నాను. దానికి ఆయన స్పందిస్తూ, దాల్ మే కాలా నహీహై, పూరా దాల్ హీ కాలాహై అని చమత్కరించాడు. మొత్తం దాల్ కాలాహై అంటే ఇక పూర్తిగా ప్రక్షాళన చేయక తప్పదు. ఇప్పుడు మనముందు ఉన్నది ఒకటే ప్రశ్న. మొత్తం ఆపరేషన్ చేసి దేశాన్ని కాపాడే ధైర్యం మనకు ఉన్నదా, లేదా? మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకురండి. రెండు – రెండున్నరేండ్లలో వెలుగు జిలుగులతో కూడిన మహారాష్ట్రను తయారుచేస్తాం. నూరుశాతం చేసి చూపిస్తాం. ఇది నా వాగ్దానం. గతంలో పాలించినవారు చేయడం చేతకాక, వాళ్ల అసమర్ధత, చేతకానితనాన్ని మనకు ఆపాదించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా చంద్రపూర్, బల్లార్షా, గడ్చిరోలిలో ఈ మాటలు చెబితే వారు ఇలాంటి ఉల్టా ప్రశ్నలే వేస్తారు.
రైతులను ఆదుకొంటే దివాళా తీస్తామా?
ఇప్పుడు మహారాష్ట్రలో సరికొత్త ప్రచారం మొదలుపెట్టారు. కేసీఆర్ చెప్పిన విధంగా ఎకరానికి రూ.10 వేలు, ఇతర పథకాలు ఇచ్చుకుంటూపోతే మహారాష్ట్ర ప్రభుత్వం దివాళా తీస్తుందని ప్రచారం చేస్తున్నారు. మేము ఏడేండ్లుగా ఇస్తున్నాం. మరి తెలంగాణ దివాళా తీయలేదెందుకు? చిన్న రాష్ట్రం, మహారాష్ట్రక న్నా బలహీన రాష్ట్రం. అటువంటిది తెలంగాణ దివాళా తీయనప్పుడు మహారాష్ట్ర ఎలా దివా ళా తీస్తుంది? ఒకటి మాత్రం నిజం. అక్కడి నాయకులు కచ్చితంగా దివాళా తీస్తారు. అధికారులు, దళారులు, ఇప్పుడు బాగా తింటున్నవారి దుకాణాలు మూతపడతాయి. రెండు అంశాలతో మీరు దేశ పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోవచ్చు. అవి నీరు, కరెంటు. ఈ రెండు సమృద్ధిగా ఉన్నప్పటికీ ప్రజలకు ఎం దుకు అందించలేకపోయారు? ఇవి మనం తలుచుకుంటే అందించగలిగేవే. ఎవ్వరినీ బి చ్చం అడుక్కోవాల్సిన అవసరం లేదు. మన మే మేల్కొనాలి. ఎంత తొందరగా మేల్కొంటామనేదే ముఖ్యం. ఎంత ఆలస్యమైతే అంత కష్టం, నష్టం అనుభవించాల్సి వస్తుంది. మనలో ఎంత చైతన్యం ఉందనేది ప్రధానం. నేను మీ అందరినీ ఒక్కటే కోరుతున్నా.. మ హారాష్ట్రను అభివృద్ధి చేయడానికి ఏదో రాకెట్ సైన్సు నేర్చుకోవాల్సిన పనిలేదు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను మక్కికి మక్కి అమలుచేస్తే చాలు.
కష్టపడితేనే ఫలితం
ఏ దేశమైనా కష్టనష్టాలను ఎదుర్కొని పనిచేసినప్పుడే అభివృద్ధి సాధిస్తాయి. చైనా పరిస్థితి ఒకప్పుడు మనకన్నా ఎంతో అధ్వానంగా ఉండేది. కానీ నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. చైనా లేకుండా ప్రపంచమే లేదన్నట్టుగా పరిస్థితి తయారైంది. చంద్రపూర్, బల్లార్షాలో ఎన్ని చైనా బజార్లున్నాయి? మేకిన్ ఇండియా అంటున్నారు. నిజంగా మేకిన్ ఇండియా అయితే భారత్ బజార్లు ఉండాలి కానీ చైనా బజార్లు ఎందుకుంటున్నాయి? పతంగుల మాంజా, దేవుడి విగ్రహాలు, దీపావళి టపాకాయలు, హోలీ రం గులు, కుర్చీలు, సోఫాలు కూడా చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. మరి మనం ఎక్కడున్నాం? ఏం చేస్తున్నాం? సంపన్నులు ఫర్నీచర్, లైట్లు తెచ్చుకోడానికి కూడా చైనా వెళ్తున్నారు. ఇవి కూడా మనం తయారు చేయలేకపోతున్నాం. ఇక్కడ వెలుగుతున్న లైట్లు కూడా చైనావే. ఏం చేస్తాం, లోకంతోపాటే మేమూ న డుస్తున్నాం. తప్పదు కదా. అందుకే ఏ వస్తువు కూడా మన దేశంలో తయారుచేయకుండా యువతను అసమర్థులుగా తయారు చేస్తున్నారు. దీనికి కారణం ఇంతకాలం దేశాన్ని ఏలిన ప్రభుత్వాలే. మనం అసమర్థులం కా దు. ఈ ప్రభుత్వాలు మనల్ని అసమర్థులుగా చేశాయి. ఇది నిజం. ప్రభుత్వాల ప్రేరణ అందకపోవడంవల్ల మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా తయారయ్యాం. పరిశ్రమలు మూసివేస్తున్నారు. ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల దేశ ఆస్తులను అమ్ముతున్నారు. ఎల్ఐసీని కూడా అమ్ముతున్నారు. ఎక్కడికి పోవాలి మనం’ అని సీఎం చెప్పారు.

Cm2
బీఆర్ఎస్లో చేరిన మహారాష్ట్ర నేతలు
మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతున్నది. నిత్యం వందలాది మంది బీఆర్ఎస్లో చేరిపోతున్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సమక్షంలో మరికొందరు మహారాష్ట్ర నేతలు చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. బీఆర్ఎస్లో చేరిన వారిలో.. ఆల్ ఇండియా డీఎన్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు, ఓబీసీ వెల్ఫేర్ సంఘ్ నాయకుడు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆనంద్‌రావ్ అంగళ్వార్, వంచిత్ ఆఘాడీ వుమెన్, చంద్రపూర్ బంజారా ఉమెన్ అధ్యక్షురాలు, ఎమ్మెల్యేగా పోటీచేసిన రేష్మచౌహాన్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొ. బల్బీర్‌సింగ్ గురు, మైనార్టీ సెల్ రాష్ట్రప్రధాన కార్యదర్శి రవీందర్‌సింగ్ సలూజా, గడ్చిరోలి మాజీ జడ్పీ చైర్మన్ పసుల సమ్మయ్య, గడ్చిరోలి మాజీ జడ్పీ సభ్యుడు సంజయ్ చర్దుకే, యువ స్వాభిమాన్ పార్టీ రాజూర జిల్లా అధ్యక్షుడు సూరజ్ థాకరే, చంద్రాపూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దిలీప్ పల్లేవార్, బిర్సాముండా క్రాంతిదళ్ అధ్యక్షుడు సంతోష్ కులమతే, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంపెల్లి మల్లేష్, ఆప్ బల్లార్పూర్ విభాగ్ అధ్యక్షుడు ప్రశాంత్ గడ్డల, ఇండియన్ టీవీ చంద్రపూర్ జిల్లా రిపోర్టర్ నరేశ్ ఆరెపల్లి, భారత్ ముక్తి మోర్చా వరింగ్ అధ్యక్షుడు శనిగరపు శం కర్, యువ స్వాభిమాన్ పార్టీ సెక్రటరీ ఆదిత్య భాకే, శివసేన గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు మిలింద్ భాసర్, చంద్రపూర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు అరికిల్ల హనుమంతు, డబ్ల్యూసీఎల్ ఐటీటీయూసీ అధ్యక్షుడు నర్సింగ్రాజం దొంత, విదర్భ తెలుగు సమాజ్ ప్ర ధాన కార్యదర్శి రాజేశం పుల్లూరి, తేలి సమా జ్ జిల్లా అధ్యక్షుడు రవి జుమ్డే, విదర్భ ముక్తిమోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ తిరమల్ ముంజమ్, శివసేన పార్టీ రాజూర పట్టణ అ ధ్యక్షుడు రాకేష్ చికుల్వార్, శివసేన బల్లార్షా అధ్యక్షుడు సన్నీరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెరెనా అజ్మీరా, యువ స్వాభిమాన్ గడ్చిరోలి ఉపాధ్యక్షుడు అజయ్ చన్నే, చంద్రపూర్ డ్రైవర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ వ్యవస్థాపకుడు అభిలాష్ సింగ్ తదితరులతోపాటుగా మరో నలభై మందికిపైగా నేతలు ఉన్నారు.