Unemployment | యువతకు శాపంగా నిరుద్యోగం.. దేశంలో రోజుకు 10 మంది నిరుద్యోగుల బలవన్మరణం
నిరుద్యోగం యువతకు శాపంగా మారుతున్నది. మరణశాసనాన్ని రాస్తున్నది. దేశంలో ప్రతిరోజు సగటున 10మంది నిరుద్యోగులు ఆత్మహ్మత్యలకు పాల్పడుతున్నట్టు కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది.
- నిరుద్యోగుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర టాప్
- కర్ణాటకలోనూ వందల్లో మరణాలు
- మూడేండ్లలో 13 శాతం తగ్గుదల
- తెలంగాణలో నిరుడు 70 శాతం తగ్గుముఖం
- పుదుచ్చేరి, లక్షద్వీప్‌లో ఒక్కటీ లేదు
- వెల్లడించిన కేంద్ర ప్రభుత్వ నివేదిక
Unemployment | హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగం యువతకు శాపంగా మారుతున్నది. మరణశాసనాన్ని రాస్తున్నది. దేశంలో ప్రతిరోజు సగటున 10మంది నిరుద్యోగులు ఆత్మహ్మత్యలకు పాల్పడుతున్నట్టు కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. 2020-22 మధ్య మూడేండ్ల కాలంలో దేశవ్యాప్తంగా 10,259 మంది నిరుద్యోగం కారణంగా ప్రాణాలు వదిలారు. దాదాపు అన్ని రాష్ర్టాల్లోనూ నిరుద్యోగుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన ఆత్మహత్యల్లో 20 శాతం ఒక్క మహారాష్ట్రలోనే జరుగుతున్నాయి. ప్రతి ఐదింటిలో ఒకటి ఇక్కడే నమోదువుతున్నది. కర్ణాటక, తమిళనాడు వరుసగా రెండు, మూడుస్థానాల్లో ఉన్నాయి.
తెలంగాణలో 70 శాతం తగ్గుదల
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంతరాష్ట్రం గుజరాత్ నిరుద్యోగుల ఆత్మహత్యల్లో నాలుగో స్థానంలో ఉంది. పైన చెప్పుకున్న కాలవ్యవధిలో ఇక్కడ 811 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణలో మాత్రం నిరుద్యోగుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. ఇక్కడ ఈ మూడేండ్లలో 60 మంది మాత్రమే ప్రాణాలు తీసుకున్నారు. 2020లో 23 మంది, 2021లో 28 మంది, 2022లో 9 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంతకుముందు ఏడాదితో అంటే 2021తో పోల్చితే ఆత్మహత్యల్లో 70 శాతం తగ్గుదల కనిపించింది. దేశంలోని 28 రాష్ర్టాలతో పోల్చినప్పుడు తెలంగాణ స్థానం 20గా ఉంది.
ఆశ్చర్యపరుస్తున్న బీహార్
రాష్ర్టాలపరంగా మణిపూర్లోఅతి తక్కువగా రెండు మరణాలు మాత్రమే నమోదు కాగా, నాగాలాండ్‌లో 8, అరుణాచల్‌ప్రదేశ్‌లో 12 మంది ప్రాణాలు తీసుకున్నారు. ఈ జాబితాలో అన్నింటికంటే ఆశ్చర్యపరిచిన రాష్ట్రం బీహార్. పేదరికం, నిరుద్యోగం తాండవించే ఇక్కడ 17 మంది మాత్రమే మరణించారు. ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా దొరికిన పని చేసుకునే అలవాటు వల్లే ఇక్కడ ఆత్మహత్యలు తక్కువని నిపుణులు చెప్తున్నారు. యూపీలో 499 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు.
కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ అదే తీరు
దేశంలోని 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆరింటిలో ఆత్మహత్యలు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ మూడేండ్లలో 698 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోగా, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లలో ఒక్క ఆత్మహత్య కూడా నమోదు కాలేదు. అండమాన్, నికోబార్ దీవులతోపాటు లడఖ్‌లో గతేడాది ఒక్కోటి చొప్పున మరణాలు నమోదయ్యాయి.
నిరుద్యోగుల ఆత్మహత్యల్లో టాప్-5 రాష్ర్టాలు (మూడేండ్లలో ఆత్మహత్యలు)


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

