ముంబై, జూలై 17(నమస్తే తెలంగాణ): తెలంగాణ సరిహద్దుకు అనుకుని ఉన్న 14 గ్రామాల సమస్యకు శాశ్వత పరిషారానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు సరిహద్దుకు ఆనుకొని ఉన్న 14 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేశారు.
ముంబైలోని విధాన భవన్లో ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి చంద్రశేఖర్ బావనకులే అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజూరా ఎమ్మెల్యే దేవరాజ్ భోంగళే, గ్రామాల ప్రజాప్రతినిధులు, చంద్రపూర్ కలెక్టర్ వినయ్గౌడ హాజరయ్యారు. ఈ భేటీలోనే నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ 14 గ్రామాలు మహారాష్ట్రలో అధికారికంగా విలీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నది.