యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ పర్వాలను సోమవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్వామివారి జన్మనక్షత్రం స్వాతినక్షత్రం సందర్భంగా ఉదయం 4 గంటలకు బ్రహ్మీ ముహూర్తంలో 108 కలశాలతో ఘటాభిషేకం నిర్వహించారు. ఆలయ ఉద్ఘాటనలో భాగంగా రెండో రోజు(మంగళవారం) ఈ క్రతువులను నిర్వహించనున్నారు.
నేటి ఉదయం 9 గంటల నుంచి.. శాంతిపాఠం, అవధారలు, యాగశాలలో చతుస్థానార్చన,ద్వారా తోరణ ధ్వజ కుంభారాధనలు, అగ్ని మధనం, అగ్ని ప్రతిష్ఠ, యజ్ఞం ప్రారంభం, విశేష యజ్ఞ హవనములు, మూలమంత్ర హవనములు, నిత్యలఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు.
సాయంత్రం 6 గంటల నుంచి.. సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, నిత్య విశేష హోమాలు, బింబ పరీక్ష, మన్నోమాన శాంతిహోమం, నవకలశ స్నపనం, నిత్య లఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు.