హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని యూటీఎఫ్-గురుకుల టీచర్ల జేఏసీ తెలిపింది. ఆ రోజు హైదరాబాద్‌లో మహాధర్నా చేస్తామని హెచ్చరించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో దాదాపు 25 సమస్యలు ఉన్నాయని వెల్లడించింది. ముఖ్యంగా పాత టైం టేబుల్‌ను అమలు చేయాలని, 010 పద్దు కింద జీతాలు చెల్లించాలని, కామన్ సర్వీస్ రూల్స్లాంటి వాటిని తక్షణమే అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఈ సమస్యలను పలుసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని, కాబట్టి 28వ తేదీన హైదరాబాద్‌లో మహాధర్నా చేపడుతామని తెలిపింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : సీనియర్ జర్నలిస్టు, ఈటీవీ బ్యూరోచీఫ్ టీ ఆదినారాయణ గురువారం మృతి చెందారు. ఆయన మృతికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డితోపాటు సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా రంగానికి అందించిన సేవలను కొనియాడారు.