Mahabubnagar | మహబూబ్నగర్ : దశాబ్దాలకు పైగా వలసలకు నిలయమైన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్లో పాలనలో రివర్స్ వలసలతో సస్యశ్యామలమైంది. నీళ్లు లేక బీడు వారిని భూములు పచ్చని పంటల పొలాలతో కళకళాడాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయని, నేడు జిల్లాలో ఉపాధి లేక మళ్లీ ముంబైకి వలసలు పోతున్నారని మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం హనుమాన్ గడ్డ తండా వాసులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Mbnr
గతంలో మేము పూణెలో పని చేశామని, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక తిరిగి సొంత ఊరికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ జీవించామన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. సరిపడా నీళ్లు, కరెంట్, రైతుబంధు, ఎరువులు ఇవ్వడంతో రైతులు పంటలు పండిస్తూ సంతోషంగా జీవించేవారన్నారు. కానీ, మార్పు అని ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రైతుబంధు, సాగు నీరు, కరెంట్ లేక రైతులు అరిగోస పడుతున్నారని అన్నారు. ఆరు గ్యారంటీలు అని చెప్పి రేవంత్ రెడ్డి జనాలని మోసం చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ మా పిల్లలు వలసలు పోతున్నారని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క తండా అని కాకుండా రాష్ట్రంలోని పల్లెలన్నీ ఇలాగే ఉంటున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.