Mahabubnagar | మహబూబ్‌నగర్ : రాష్ట్ర మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ కలిసి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా దేశంలో అతిపెద్ద అర్బన్ టూరిజం పార్క్ అయినా కేసీఆర్ అర్బన్ ఎకో టూరిజం పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫారెస్ట్ జంగల్ సఫారీని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
అనంతరం ఫారెస్ట్ జంగల్ సఫారీలో భాగంగా నిర్మించిన వాచ్ టవర్‌ను పరిశీలించారు. ఫారెస్ట్ సఫారీ చేసే సమయంలో ఆకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. వర్షంలోనూ సఫారిని కొనసాగిస్తూ వాచ్ టవర్ నుండి ఫారెస్ట్‌ను తిలకించారు. మహబూబ్‌నగర్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న ఫారెస్ట్ పార్కులో జంగల్ సఫారీ ఎంతో అద్భుతంగా ఉందని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. పర్యాటకులకు ఈ సఫారీ మధురమైన జ్ఞాపకంగా నిలుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా దేశంలో అతిపెద్ద అర్బన్ టూరిజం పార్క్ అయినా కేసీఆర్ అర్బన్ ఎకో టూరిజం పార్కు లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫారెస్ట్ జంగల్ సఫారీ ను మంత్రి కేటీఆర్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి,… pic.twitter.com/PDyFkUUU8z
— V Srinivas Goud (@VSrinivasGoud) May 6, 2023