సృష్టి, స్థితి, లయ కారకుడైన మహాశివుని పుట్టిన రోజు వేడుకను రాష్ట్రమంతా సంబురంగా జరుపుకొన్నది. తెలంగాణలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శంభోశంకర.. హరహర మహాదేవ నినాదాలతో ఆలయాల పరిసరాలు హోరెత్తాయి. అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రజలు శివుడిని పవిత్ర జలాలతో అభిషేకించారు. రోజంతా ఉపవాసాలు చేసి భక్తిప్రపత్తులు చాటుకున్నారు. కీసర, వేములవాడ, రామప్ప, ఏడుపాయల తదితర ఆలయాలను మంత్రులు, ప్రముఖులు సందర్శించి పూజలు నిర్వహించారు.