మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో(Mukteshwara Temple) నేడు (శుక్రవారం ) మహా కుంభాభిషేక మహోత్సవ(Maha Kumbha Abhishekam) వేడుకలు ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించే మహా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో మొదటి రోజు ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో వేద గోదావరి నదికి వెళ్లి వేదమంత్రోచ్ఛరణతో గోదావరిమాతకు ప్రత్యేక పూజలు చేసి కలశాలలో జలాలను ఆలయానికి తీసుకవచ్చారు. ఆలయంలో ముందుగా గోమాత పూజ, గణపతి పూజ స్వస్తి పుణ్యా వచనం, రిత్విక వర్ణన,మంటప స్థాపన, చండి పారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఇవి కూడా చదవండి..
Delhi Schools | ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు
Prank Videos | ప్రాంక్‌తో పరేషాన్.. జనాలకు టెన్షన్.. వ్యూస్ కోసం యూట్యూబర్ల వికృత పోకడ
Bhupalpally | భూపాలపల్లి జిల్లాలో విషాదం.. బైకు అదుపుతప్పి యువకుడు మృతి