భద్రాచలం, ఏప్రిల్ 3: మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో భూస్థాపితం చేస్తామని మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా, దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ముద్దా పిచ్చయ్య, మాదిగ దండోరా జిల్లా అధ్యక్షుడు గురజాల వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
మాదిగల ద్రోహి రేవంత్‌రెడ్డికి బుద్ధి చెబుతామని ప్రతినబూనారు. భద్రాచలంలో బుధవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాదిగల మద్దతుతోనే ఈ స్థాయికి ఎదిగానని అనేక వేదికలపై మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు మాదిగలను అవమానిస్తున్నారని మండిపడ్డారు.