హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఫిరాయింపులకు పార్టీ వ్యతిరేకమైనా తప్పడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ పేర్కొన్నారు. ఆత్మరక్షణ కోసం ఎదు రు కాల్పులు చేయడంలో తప్పులేదని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో ఇ ష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్య లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్రెడ్డి, తాను చాలా కష్టపడ్డామని చెప్పారు. తాను కాంగ్రెస్లో 50 ఏండ్లకు పైగా ఉన్నానని చెప్పారు. తాను పార్టీలు మారలేదని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మాదిరిగా చేరికల సందర్భంగా తా ము ఎటువంటి హామీ ఇవ్వడంలేదని, మంత్రి పదవులు ఇస్తామని చెప్పడం లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు కేసుల నుంచి తమను తప్పించాలని, ప్రతిఫలంగా వందల కోట్లు ఇస్తామని ప్రభుత్వంలోని కొందరు పెద్దల చుట్టూ తిరుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా పరీక్ష రాసే వారు ఎవరూ వాయిదా వేయాల ని అడగరని పేర్కొన్నారు. రూ. 100 కోట్ల వ్యాపారం జరుగుతుందని, ఈ నేపథ్యంలోనే శిక్షణ కేంద్రాలు వాయిదా వేయాలని కోరుతున్నాయని ఆరోపించారు.