హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతి మాటల అబద్ధం, ప్రతి విషయంలో అవగాహన రాహిత్యం, ప్రతి పనిలో అనుభవరాహిత్యం కనిపిస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు.
మిడిమిడి జ్ఞానం, అడ్డగోలుగా అరవడం, బాధ్యత రాహిత్యం కలిపితే రేవంత్రెడ్డి అని ఎద్దేవా చేశారు. విచక్షణ కోల్పోయి ఆయన చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. రేవంత్రెడ్డి ప్రజల జీవితాలో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.