హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో (Telangana Bhavan) రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హరీశ్ రావుతో కలిసి మండలిలో విపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పార్టీ కార్యలయ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ వాణీ దేవి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పొన్నాల లక్ష్మయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Live: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
📍తెలంగాణ భవన్, హైదరాబాద్ https://t.co/B4U3iRCTy1
— BRS Party (@BRSparty) June 2, 2025