హైదరాబాద్ : రాష్ట్రంలో వీధి కుక్కలు(Stray dogs) రెచ్చిపోతున్నాయి. నిత్యం ఏదో ఓ చోట కుక్కల దాడిలో ప్రజలు గాయపడుతూనే ఉన్నారు. వీధికుక్కల దాడిలో చిన్నారులు మృత్యు వాత పడిన ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటామని అధికారులు చెపుతున్నా.. కార్యరూపం దాల్చడం లేదు. చివరికి హైకోర్ట్ ప్రభుత్వాన్ని మందలించినా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తాజాగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో రెండు రోజుల వ్యవధిలో ఓ శునకం సుమారు 30 మందిని గాయపరిచింది.
అదే కుక్కు హుజూరాబాద్‌లో(Huzurabad) పారిశుద్ధ్య విధులకు వెళ్తున్న గాంధీనగర్‌కు చెందిన భాగ్య, విజయ్, సీనియర్ సానిటరీ సూపర్ వైజర్ రమేష్ పై(Sanitation workers )దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. అలాగే మామిళ్లవాడలో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులను గాయ పరిచింది. కుక్కదాడిలో గాయపడినవారిని వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. కాగా, చిన్న పిల్లలు ఒంటరిగా కనిపిస్తే కుక్కలు దాడి చేస్తున్నాయని పలువురు పేర్కొన్నారు. దీంతో పిల్లలను బయటకు పంపించడానికే స్థానికులు వణికి పోతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పారిశుద్ధ్య కార్మికులపై పిచ్చికుక్క దాడి
కరీంనగర్ – హుజూరాబాద్‌లో రెండు రోజుల వ్యవధిలో ఓ కుక్క సుమారు 30 మందిని గాయపరిచింది.
అదే కుక్కు హుజూరాబాద్‌లో పారిశుద్ధ్య విధులకు వెళ్తున్న గాంధీనగర్ కు చెందిన భాగ్య, విజయ్, సీనియర్ సానిటరీ సూపర్ వైజర్ రమేష్ పై దాడిచేసి తీవ్రంగా… pic.twitter.com/cpaYtJw1uq
— Telugu Scribe (@TeluguScribe) July 19, 2024