హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్ పాల్గొన్నారు. మహా శివరాత్రి సందర్భంగా మంగళవారం దుబ్బాక మండలంలోని కూడవెల్లి రామలింగేశ్వరస్వామి ఆలయంలో వద్ద మారేడు మొక్కను నాటారు. ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ కూడవెల్లి క్షేత్రంలాంటి పురాతన ఆలయంలో మొక్క నాటడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ వంటి అద్భుత కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ పరమేశ్వరుడి కృపతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు సంకేత శర్మ ఎంపీ పేరిట ప్రత్యేక అర్చనలు చేశారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి పూర్ణ, ఆలయ అర్చకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.