సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటిస్తున్న గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘గోదారి గట్టుపైన’. సుభాష్‌చంద్ర దర్శకుడు. రెడ్పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నది. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ని ముమ్మరం చేశారు. శుక్రవారం ఈ సినిమా నుంచి మూడో పాట ‘బంగారు బొమ్మ’ను విడుదల చేశారు. నాగవంశీ స్వరపరచిన ఈ గీతాన్ని బాలాజీ రచించారు.
వింటేజ్ ఫీల్‌తో సాగిన ఈ పాట ప్రేమికుల మదిలోని మధురభావాలను ఆవిష్కరించింది. ప్రేయసిని ‘బంగారు బొమ్మ’ అని పిలిచే కథానాయకుడు ఆమెపై ఉన్న అనురాగాన్ని ఈ పాట ద్వారా వ్యక్తం చేశారు. జగపతిబాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవిప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నాగవంశీకృష్ణ, నిర్మాత: అభినవ్ రావు, రచన-దర్శకత్వం: సుభాష్‌చంద్ర.