Medigadda Barrage | మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులపై ఎల్అండ్ సంస్థ కీలక ప్రకటన చేసింది. బ్యారేజీలో ఏడో బ్లాక్ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని సంస్థ ప్రకటించింది. పగుళ్లు వచ్చిన పియర్ల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగానే ఆనకట్టను నిర్మించినట్లు సంస్థ పేర్కొంది. ఐదు సీజన్లుగా వరదలను ఆనకట్ట ఎదుర్కొందని తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీని 2019లో అప్పగించినట్లు తెలిపింది. మేడిగడ్డ అంశం ప్రస్తుతం అధికారుల పరిశీలన, చర్చల్లో ఉందని చెప్పింది. తుదిపరి కార్యాచరణపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, నిర్ణయం చెప్పగానే దెబ్బతిన్న భాగం పునరుద్ధరణ చర్యలు చేపడుతామని వివరణ స్పష్టం చేసింది.