హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (ఎల్ఆర్ఎస్)పై ఇస్తున్న 25% రాయితీ గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. ఇప్పటికే మూడుసార్లు పొడిగించిన ఈ గడువును తాజాగా ఈ నెల 30 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో అనుమతి లేని లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు 20 20లో ప్రవేశపెట్టిన ఈ పథకం కింద 25.67 లక్షల దరఖాస్తులు వచ్చా యి. ఎల్ఆర్ఎస్ ద్వారా మొత్తం రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావించింది. కానీ, మే31 నాటికి 7లక్షల మంది ఫీజు చెల్లించడంతో రూ. 1,986.55 కోట్ల ఆదాయం సమకూరింది.
హైదరాబాద్,చిక్కడపల్లి, జూన్ 17 (నమస్తే తెలంగాణ): భవన నిర్మాణ సంక్షేమ బోర్డు క్లెయిమ్‌లను ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఏఐటీయూసీ తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వరర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డును ఇన్సూరెన్స్ రంగాలకు ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచన అన్యాయమని పేర్కొన్నారు.