హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)కు ప్రకటించిన వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోనెల వరకు పొడిగించింది. గతనెల 31తేదీతో ఓటీఎస్ గడువు ముగియగా, దీనిని ఈనెల 30 వరకు పొడిగిస్తూ గురువారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ జీవో జారీచేశారు.
బహుజన పోరాటయోధుడు పాపన్న
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కొనియాడారు. బడుగుల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని బుధవారం ఎక్స్ వేదికగా కొనియాడారు. ఆ మహనీయుడి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో జయంత్యుత్సవాలు, వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించిన ఘనత కేసీఆర్‌కే దకిందన్నారు.