ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. గడిచిన మూడు రోజులుగా జిల్లాలో చలి తీవ్రత భారీగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఉదయం, రాత్రి సమయాల్లో చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఏజెన్సీ ప్రాంతాలు వణికిపోతున్నాయి.
సిర్పూర్, గిన్నెదరిలో 11.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సోనాల, తిర్యాణిలో 12.1 డిగ్రీలు, బజార్హత్నూర్లో 12.2 డిగ్రీలు, వాంకిడిలో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ చలి బాగానే పెరిగింది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిని పొగమంచు కప్పేసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.