రాజాపేట, మార్చి 8: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట (Rajapeta) మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోని ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి చలి వనికిస్తుండడంతో మంటలు కాగుతూ కనిపిస్తున్నారు. గత వారం రోజులుగా వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రత తగ్గిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో రాత్రి వేళలో ఇంటా బయట తిరగడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోయి. గ్రామాల్లో ఉదయం 8,9 గంటల వరకు . చలి తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చిరు వ్యాపారుల చలికి ద్విచక్ర వాహనాలపై వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎండాకాలంలో సైతం చలి మంటలకు కాచుకుంటూ ఉపశమనం పొందుతున్నారు.
మర్చిలోనూ వదలని మంచు
సాధారణంగా సెప్టెంబర్ నుంచి జనవరి నెలల మధ్య మంచు కురుస్తూ ఉంటుంది. సంక్రాంతి తర్వాత వాతారణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. కానీ దీనికి భిన్నంగా మార్చి నెలలోనూ కొన్ని ప్రాంతాల్లో మంచు దుప్పటి కప్పేస్తున్నది. శనివారం ఉదయం సూర్యాపేట జిల్లా చివ్వేంల మండల కేంద్ర శివారుతోపాటు, బీబీగూడెం, అక్కలదేవి గూడెం, సూర్యాపేట-ఖమ్మం రహదారి, హైదరాబాద్-ఖమ్మం రహదారిపై దట్టంగా మంచు కమ్మేసింది. రోడ్డుపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. ఉదయం 8 గంటలు అయినా మంచు దుప్పటి వదలకపోవడంతో ఇదెక్కడి కాలమని, ఒక్కరోజులో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటుండటంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. కాగా, రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొన్నది. ఉదయం 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల తర్వాత చలిగాలులు వీస్తున్నాయి. 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.