హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.. సోమవారం వాయవ్య, పరిసర పశ్చిమ -మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేరొంది. వచ్చే మూడు, నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ర్టాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేరొంది.