హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయం వరకు మధ్య బంగాళాఖాతం వరకు చేరుతుందని, ఆ తర్వాత రెండురోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ తీరాలకు చేరే అవకాశం ఉందని వెల్లడించింది.