మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో (Bayyaram) ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రియురాలు మరణించగా, ప్రేమికుడి పరిస్థితి విషమంగా ఉంది. బయ్యారం మండలం కోటగడ్డకు చెందిన ప్రవళిక, రవీందర్ గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రవళిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. అయితే ఆమె మరణ వార్త తెలుసుకున్న రవీందర్.. కత్తితో గొంతు కొసుకున్నాడు. దీంతో స్థానికులు అతడిని హుటాహుటిన దవాఖానకు తరలించారు.
మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం దవాఖాను తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రవళిక మృతదేహాన్ని మహబూబాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.