రాయపోల్, మార్చి 13: సెల్‌ఫోన్ జీవితంలో భాగమైంది. పెరిగిన సాంకేతిక కారణంగా మాట్లాడటానికే కాదు.. సమచారం తెలుసుకోవాలన్నా, నగదు చెల్లంపులు చేయాలన్నా.. చదువు, పాటలు, సినిమాలు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఎదైనా దరఖాస్తు చేయాన్న సెల్‌ఫోన్ పైనే ఆధారపడుతున్నాం. అరచేతిలో ప్రపంచాన్ని మన కండ్లముందుచే సెల్‌ఫోన్ చోరీలకు గురైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించనవసరం లేదు. ఈ సమస్యలను అధిగమించేందుకు కేంద్ర టెలికం మంత్రిత్వశాఖ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటి రిజిస్టర్ (CEIR)ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అపహరణకు గురైన మన సెల్‌ఫోన్‌ను గుర్తించవచ్చు. దీనికోసం మనం ఏం చేయాలంటే.. సీఈఐఆర్ వెబ్సైట్లోకి వెళ్తే.. రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్, స్టోలెన్ మొబైల్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అందులో సెల్‌ఫోన్‌కు చెందిన ఐఎంఈఐ నంబర్, కంపని పేరు, సెల్‌ఫోన్ మోడల్ పేరు బిల్లులను వెబ్సైట్లో పోందుపరచాలి. ఆన్లైన్ వివరాలు నమోదు చేసిన తర్వాత ఓటీపీ కోసం మరో సెల్‌ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలను పొందుపరచిన తర్వాత ఫిర్యాదు దారుడి ఐడీ నంబర్ వస్తుంది. అనంతరం సెల్‌ఫోన్‌ను పనిచేయకుండా చేస్తుంది.
ఏ కంపనీ సెల్‌ఫోన్ అయినా సీఈఐఆర్ ఫోర్టల్‌లో నమోదు చేయాగానే పనియుకుండా పోతుంది. దీంతో దానిని ఎవరు ఉపయోగించడానికి వీలు ఉండదు. దీంతో పాటు ఫోన్ ఎక్కడ ఉందనే వివరాలు పోలీసులకు అందిస్తుంది. సెల్‌ఫోన్ లభించిన తర్వాత హోటల్లో అన్నాక్స్ లేదా ప్రౌండ్ మొబైల్‌ను లింక్ చేయాలి. ఇటీవల రాయపోల్, దౌల్తాబాద్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురు సెల్‌ఫోన్ పోగొట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయా ఫోన్ల వివరాలను సీఈఐఆర్ఐ వెబ్సైట్లో నమోదు చేసి, మొబైల్ ఆచూకీ కనుగోని, వాటిని బాధితులకు అందజేశారు. వెలాది రూపాయలు పెట్టి కొన్న సెల్‌ఫోన్ పోతే గతంలో బాధపడేవారు. కానీ ప్రస్తుతం వచ్చిన ఆధునిక టెక్నాలజీతో పోయిన ఫోన్లు తీరిగి బాధితులకు అందిచడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సెల్‌ఫోన్ పోతే ఫిర్యాదు చేయండి..
సెల్‌ఫోన్ పోగొట్టుకున్నవారు నేరుగా మీసేవాలో దరఖాస్తులు చేసి పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేస్తే సీఈఐఆర్ ద్వారా రికవరీ చేయవచ్చని రాయపోల్ ఎస్ఐ విక్కుర్తి రఘపతి అన్నారు. వాటిని గుర్తించి బాధితులకు అందిస్తామని చెప్పారు.