సూర్యాపేట, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడు నీళ్లు రాక నాలుగెకరాల్లో వేసిన వరి ఎండిపోయింది. మహిళలకు ఉచి త ప్రయాణంతో రోజూ ఐదారొందలు సం పాదించే ఆటో బందైంది. ఇయ్యాళ బతకాలంటే అప్పు చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఏడేండ్లపాటు కేసీఆర్ ఇచ్చిన నీళ్లతో పండిన పంట, ఉపాధిని ఇచ్చిన ఆటోతో ధైర్యంగా బతికినోడు ఇప్పుడు జీవనాధారం కోల్పాయాడు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మం డలం బండమీది చందుపట్లకు చెందిన శిగ కాశయ్య దీనగాథ ఇది. ‘కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం కాను.. మా కుటుంబాలను నాశనం చేస్తుంది’ అంటూ ఎండిన పొలాన్ని, చుక్కనీళ్లు రాని కాలువను చూపిస్తూ కాశయ్య శా పనార్థాలు పెడుతున్నాడు. కాశయ్యకు గ్రామంలో నాలుగు ఎకరాల సాగు భూమి ఉన్నది.
కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. 2018లో తొలిసారి నీళ్లు రావడంతో నాలుగు ఎకరాల్లో వరి వేశాడు. ఏడాదికి రెండు పంటలు వేయడంతో అన్ని ఖర్చులు పోనూ రూ.1.50 లక్షలు మిగిలేవి. భార్య, ముగ్గురు కూతుళ్లను సాకేందుకు ఆటో తోలడంతో నెలకు రూ.15 వేలు, ప్రతి సీజన్లో పంట పెట్టుబడి కింద ఏటా రూ.40 వేలు అందేవి. ఇలా రెండుమూడేండ్లలోనే కుటుంబ ఆర్థిక పరిస్థితి మా రిపోయింది. ఆర్థికంగా కొంత బలపడటం తో నాలుగేండ్ల క్రితం పెద్ద కూతురి పెండ్లి చే యగా.. కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష సాయం అందింది. మరో ఇద్దరు కూతుళ్లలో ఒకరిని ఇంజినీరింగ్, మరొకరిని డిగ్రీ చదివిస్తున్నా డు. ఇలా సంతోషంగా జీవిస్తున్న కాశయ్య కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గత యాసంగికి నీళ్లు సరిగా రాక ఎకరం ఎండిపోగా.. ఈ యాసంగికి చుక్కనీరు రాక నాలుగెకరాల్లో పంట ఎండిపోయింది. నీళ్లు పోవడమే కాదు.. రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదించే ఆటోను మహిళలకు ఉచిత బస్సు స్కీమ్‌తో అమ్మేసుకున్నా. కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు కూడా రాకపోగా.. ప్రస్తుతం నాలుగు ఎకరాలు ఎండిపోగా రూ.1.60 లక్షల నష్టం వచ్చింది. పంటను కాపాడుకునేందుకు రెండు బోర్లు వేస్తే మరో రూ.40వేలు అప్పు అయ్యింది. బీఆర్ఎస్ హయాంలో జాలువారుతుండేది. నీళ్లు బంద్ చేయాలని ఫోన్లు చేస్తే కానీ నీళ్లు బందయ్యేది కాదు. ఇయ్యాళ ఎన్ని ఫోన్లు చేసినా నీళ్లు వస్తలేవు. ఈ ప్రభుత్వానికి ఓటు వేసినందుకు బుద్ధివచ్చింది. ఈ ప్రభుత్వం నాశనం కాను.. మమ్మల్ని నాశనం చేస్తుంది.
– కాశయ్య, రైతు, బండమీది చందుపట్ల